త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ హాజరయ్యారు.
కేంద్ర మంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్, ఇతర బీజేపీ నాయకులు, ఎమ్మె్ల్యేలు హాజరయ్యారు. ప్రధాని మోడీ అభివృద్ధి ఎజెండాను మరింత ముందుకు తీసుకు వెళతానని తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారిస్తానని, త్రిపుర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక అక్కడకు డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ, మంత్రి రామ్ ప్రసాద్ పాల్ లు వచ్చారు.
సాహను ముఖ్యమంత్రిగా నియమించడం పట్ల వీరిద్దరూ శనివారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో కుర్చిలను విరగ్గొట్టారు.