త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మళ్ళీ రెండో సారి పదవి చేబట్టనున్నారు. సోమవారం జరిగిన బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయనను తమ నూతన నేతగా ఎంపిక చేశారు.
ఆయన ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందని, ఆయన ఈ నెల 8 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ముఖ్యమంత్రి కావచ్చునని మొదట వార్తలు వచ్చాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సాహాను తిరిగి పదవి వరించింది
. ఈ సారి ఏ సీఎం అభ్యర్థి పేరునూ బీజేపీ ప్రకటించలేదు. అయితే సాహాకు తిరిగి అధికార పగ్గాలను అప్పగించాలని పార్టీ ప్రచార కమిటీ సూచించింది.
బుధవారం సాహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కావచ్చునని తెలుస్తోంది. తాను గవర్నర్ ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తనను ఆహ్వానించాలని కోరుతానని మాణిక్ సాహా తెలిపారు.