త్రిపుర పదకొండవ ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రితో పాటు నూతన మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం.
బీజేపీ నేత బిప్లవ్ కుమార్ దేబ్ తన ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు విస్మయానికి గురయ్యాయి.
ఆయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీ శాసన సభా పక్షనేతగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మాణిక్ సాహా ఎన్నికయ్యారు. మాణిక్ సాహా కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2016లో బీజేపీలో చేరారు.