రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ మెంబర్షిప్, ఎన్ రోలర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే.. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ వ్యవహరిస్తున్నారిని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. షాద్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ 36 వేల సభ్యత్వాలు నమోదు చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిషన్ 78 ను ప్రారంభించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాలతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కబ్జాలపై రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రానికి ఎన్ని సార్లు పిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఠాగూర్. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి ఎవరూ చేయించింది కాదని.. అది ప్రజల్లో వచ్చిన మార్పు అని ఠాగూర్ అన్నారు. రాబోయే కాలంలో గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలకు మల్లారెడ్డికి పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. 500 కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన ఎన్రోలర్స్ ను సన్మానించారు ఠాగూర్.