దుబాయి నుండి మనిలా వెళ్తోన్న సిబు ఫస్ట్ వీక్ ఎయిర్‌లైన్స్ శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న ప్రయాణికురాలు పురిటినొప్పులతో బాధపడుతుండటంతో… అత్యవసర ల్యాండింగ్ చేశారు. అప్పటికే రెడీగా ఉన్న అంబులెన్స్‌లో శంషాబాద్ అపోలోకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసినా… మార్గ మద్యలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.