జేఎన్‌టీయూ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ విద్యార్థి నాయకులు భగ్గుమన్నారు. వీసీ ఛాంబర్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
మొత్తం 183 అడ్మిషన్లకు ఓపెన్ క్యాటగిరిలో ఎస్సీ-5, ఎస్టీ-1, బీసీ-29, ఓసీ 148 సీట్లను ఉవ్వాల్సి ఉండగా.. కేటాయింపుల్లో తేడా జరిగిందన్నారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు. వెంటనే సంబంధిత అధికారి వెంకటరమణా రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.