మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడిని కలవనున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ సోమవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై అమిత్ షాతో ఆయన చర్చించనున్నారు.
జల్ జీవన్ మిషన్ (జేజేఏం) పథకం కింద తాగునీటి కుళాయి కనెక్షన్‌లతో 50.32 శాతం గ్రామీణ కుటుంబాలను కవర్ చేస్తూ త్రిపుర జాతీయ సగటును అధిగమించిందని రాష్ట్ర తాగునీరు, పారిశుద్ధ్య (డీడబ్ల్యుఎస్) మంత్రి సుశాంత చౌదరి శనివారం తెలిపారు.
రాష్ట్ర పనితీరును కేంద్రం అభినందించిందని ఆయన వెల్లడించారు. త్రిపుర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రూ. 100 కోట్ల రివార్డ్ అందజేసిందని మంత్రి చౌదరి తెలిపారు.