మరికొద్ది రోజుల్లో మణిపూర్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మందికి నేర చరిత ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో పేర్కొంది.
మొదటి దశ ఎన్నికల్లో 173 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో 21 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు నివేదిక తెలిపింది. 16శాతం అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది.
అభ్యర్థుల్లో ఇద్దరిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని, మరో ఇద్దరిపై హత్య కేసులు, ఆరుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్టు నివేదికలో ఏడీఆర్ చెప్పింది.
పార్టీల పరంగా చూస్తే బీజేపీ నుంచి 38 మంది పోటీలో ఉండగా వారిలో 11 మంది(29 శాతం), జేడీయూ 28 మందిలో 7గురు(25శాతం), కాంగ్రెస్ లో 35 మందిలో 8(23శాతం), ఎనీపీపీలో 27 మందిలో ముగ్గురు(11శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్టు నివేదిక పేర్కొంది.