మంత్రి సత్యేందర్ జైన్ తర్వాత డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కేంద్రం టార్గెట్ చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
‘ మమ్మల్ని అందరినీ ఒకేసారి అరెస్టు చేయండి. మాపై విచారణ సంస్థలతో దాడులు చేయించండి. మాపై విచారణలు జరపండి. ఆ తర్వాత మేము పనుల్లోకి తిరిగి రావచ్చు. ఎందుకంటే మాకు రాజకీయాలు అర్థం కావు. కేవలం మేము పని చేయాలనుకుంటున్నాము’ అని అన్నారు.
అవినీతి ఆరోపణలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసేందుకు కేంద్రం రెడీ అవుతోందని తమకు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. గతంలో సత్యేంధ్ర జైన్ విషయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇటీవల జైన్ అరెస్ట్ అయ్యారు.
‘ విద్యారంగంలో మనీశ్ సిసోడియా చేసిన విశేషమైన సేవలతో లబ్ది పొందిన 18 లక్షల మంది విద్యార్థులను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరే చెప్పండి మనీశ్ అవినీతికి పాల్పడ్డారా?. ప్రపంచ దేశాల్లో భారత్ కు ఆయన కీర్తిని తెచ్చిపెట్టారు. అలాంటి వ్యక్తిని శిక్షించాలా? లేదా అభినందించాలా?’ అని అడిగారు.