మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ రోజు సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల ఆయనకు సీబీఐ సమన్లు పంపింది. ఈ క్రమంలో తనను అరెస్టు చేస్తారంటూ ఆయన తెలిపారు.
రాబోయే గుజరాత్ ఎన్నికలతో సమన్లకు ముడిపెడుతు మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్ రాష్ట్రంలో ప్రచారం చేయకుండా తనను నిరోధించే బీజేపీ ప్రణాళికలోనే తనను అరెస్టు చేస్తారని ఆయన పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తాను గుజరాత్ వెళ్లాల్సి ఉందన్నారు. ఇంతమంది గుజరాత్‌ను ఘోరంగా కోల్పోతున్నారని పేర్కొన్నారు. తనను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఆపడమే బీజేపీ నేతల ఉద్దేశమని ఆయన ట్వీట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఈ రోజు ఉదయం 11 గంటలకు సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో విచారణకు హాజరు కావాలని ఆయనకు సీబీఐ సమన్లు పంపింది. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిసోడియాను అరెస్టు చేస్తారని ఆప్ ఆరోపణలు చేసింది.