లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈ నెల 22 తో ఆయన ఈడీ రిమాండ్ ముగియనుంది. ఈ కేసులో సిసోడియా సిబిఐ విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ ప్రక్రియ నేపథ్యంలో విచారణకు సంబంధించి తనకు కొంత వ్యవధినివాలని ఆయన కోరడంతో సీబీఐ ఇందుకు అంగీకరించింది. ఆయన విచారణను వాయిదా వేసింది.
త్వరలో ఆయనకు కొత్త తేదీని తెలియజేస్తామని అధికారులు తెలిపారు. తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ సిబిఐని వినియోగించుకుంటోందని, మళ్ళీ తాను అరెస్టు కావచ్చునని సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు, ఇక ఈ కేసులో ఆయననుంచి తాము మరింత సమాచారం రాబట్టవలసి ఉందని, అందువల్ల మరో 14 రోజులు ఆయన జుడిషియల్ కస్టడీని పొడిగించాలన్న సిబిఐ అభ్యర్థనను స్పెషల్ జడ్జ్ ఎం.కె. నాగ్ పాల్ అంగీకరించారు.
సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై మంగళవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. . ఆయనను సోమవారం కోర్టు ముందు వర్చ్యువల్ గా ప్రవేశ పెట్టారు. ఏప్రిల్ 3 వరకు మనీష్ సిసోడియా జూడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా పెద్ద ఎత్తున డిజిటల్ సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి యత్నించారని, 14 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఇదివరకే కోర్టు దృష్టికి తెచ్చింది. కేవలం ఒకే ఒక్క ఫోన్ ను మాత్రం సిబిఐ స్వాధీనం చేసుకోగలిగిందని పేర్కొంది.