''జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది'' : మనీషా కొయిరాల - Tolivelugu

”జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది” : మనీషా కొయిరాల

 

Manisha Koirala inspires fans by sharing pictures of her cancer recovery, ”జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది” : మనీషా కొయిరాల

జీవితంలో రెండో అవకాశం గురించి నటి మనీషా కొయిరాలకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో! క్యాన్సర్ వ్యాధికి గురై మృత్యు ముఖంలో నుంచి బయటపడ్డ ఆ 49 ఏళ్ల నటి తన ట్విట్టర్ ప్రొఫైల్ లో ఓ స్ఫూర్తిదాయకమైన పోస్ట్ పెట్టారు. ”జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది..నేను ఎప్పటికీ గొప్పదాన్ని” అని ట్వీట్ చేశారు. అంతేకాదు క్యాన్సర్ చికిత్స పొందేటప్పుడు తీసిన ఫోటో…ఇప్పుడు మంచు పర్వతంపై నిలబడి ఉన్న ఫోటోను పక్క పక్కన పోస్ట్ చేశారు.
2012 లో అండాశయ క్యాన్సర్ కు గురైన మనీషా కొయిరాల తను అనుభవించిన బాధ, మృత్యువు నుంచి బయటపడ్డ అనుభవాలను ”హీల్డ్‌ : హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్‌” పేరిట పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ”నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నాను…స్పృహ లోకి వచ్చేటప్పటికి కొత్త జీవితం కనిపించింది” అని ఆ పుస్తకంలో రాశారు. జీవితాన్ని కొత్త వెలుగులో, కొత్త ఆశలతో, చాలా విషయాలను కొత్తగా చూస్తున్నాను అని అన్నారు. అంతేకాదు ” నా జీవితం..నా ఆరోగ్యం..నాకు ఎంత ముఖ్యమో కూడా తెలిసింది”అన్నారు.
మనీషా కొయిరాల 1991 లో సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించి చాలా కొద్ది కాలంలోనే మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఆ తర్వాత 1942:ఎ లవ్ స్టోరీ, బాంబాయి, అకేలే హమ్..అకేలే తుమ్, దిల్ సే, వంటి హిట్ చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక 2018 లో ప్రస్థానం సినిమాలో సంజయ్ దత్ భార్యగా నటించారు.

Manisha Koirala inspires fans by sharing pictures of her cancer recovery, ”జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది” : మనీషా కొయిరాల

Share on facebook
Share on twitter
Share on whatsapp