చిరంజీవి 152కి మణిశర్మ - Tolivelugu

చిరంజీవి 152కి మణిశర్మ

manisharma roped in chiranjeevi koratala siva 152 movie, చిరంజీవి 152కి మణిశర్మ

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152 వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే .అయితే సైరా విజయంతో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొదట ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ అని అనుకున్నప్పటికీ కొత్తగా మణిశర్మ లైన్ లోకి వచ్చాడు. ఇటీవల రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ చిరు 152 కి ఛాన్స్ కొట్టేశాడు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్స్ ఇచ్చిన మణిశర్మ మెగా కాంపౌండ్ కు దూరమయి చాలా సంవత్సరాలు అయ్యింది. క్యాస్ట్ ఫీలింగ్ వల్లో లేదా ఇంకే కారణాలవల్లో దేవి శ్రీ ప్రసాద్ వచ్చాక మణిశర్మ కు చిరంజీవి సినిమాలు రావడం మానేసాయి. మెగాస్టార్ కు స్టాలిన్ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ అప్పటి నుంచి మెగా కాంపౌండ్ కు దూరంగానే ఉన్నారు. అటు రాజమౌళి సినిమాలకే కీరవాణి పరిమితం అవ్వటం, మరో వైపు దేవి శ్రీ ప్రసాద్ రొటీన్ మ్యూజిక్, తమన్ కాపీ ట్యూన్స్ కావటంతో కొరటాల మణిశర్మ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా చిరు 152 సినిమాలో అవకాశం రావడం మణిశర్మ ఈజ్ బాక్ అని ఇండస్ట్రీవర్గాలు చెప్పు కుంటున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ తో తన టాలెంట్, స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు మణిశర్మ. చాలా సంవత్సరాల తరువాత చిరు మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో వేచి చూడాలి.

 

manisharma roped in chiranjeevi koratala siva 152 movie, చిరంజీవి 152కి మణిశర్మ

Share on facebook
Share on twitter
Share on whatsapp