ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విశాఖకు హడావిడిగా రమ్మని సీఎం ఆహ్వానిస్తున్నారని అన్నారు.
సమస్యను తనకు తానుగా సృష్టించిన జగన్.. అందరూ తన వద్దకు వచ్చి బతిమిలాడాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చర్చలకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
సీఎం సొంత పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని అన్నారు నాదెండ్ల. హడావుడిగా హీరోలను పిలిచి మాట్లాడారని.. అమరావతి రైతులను ఎందుకు పిలిపించుకుని మాట్లాడడం లేదని నిలదీశారు. అయినా.. మీటింగ్ కు అందర్నీ పిలవాలిగా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ కేవలం హీరోలతోనే చర్చలు జరుపుతారా? అని అడిగారు మనోహర్. మహారాజులాగా కూర్చొని, పబ్లిసిటీ కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.