దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్‌లు రెండుకూడా భారత్ లో విలీనం అవుతాయనిహర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుగ్రామ్‌లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీ మోర్చాలో ఆయన మాట్లాడుతూ… తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలను ఏకం చేసినట్లే భారత్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ విలీనం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.తూర్పు, పశ్చిమాలు ఏకం అయినప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల విలీనం కూడా సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
చాలా కాలం క్రితం 1991 లో ప్రజలు బెర్లిన్ గోడలను బద్దలు కొట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా ఆయన దేశ విభజన గురించి వ్యాఖ్యానించారు. 1947 దేశం పాకిస్తాన్, ఇండియాగా విడిపోవడం బాధాకరం అని వర్ణించారు.
పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని ఖట్టర్ అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆర్ ఎస్ ఎస్ కు భయపడి… కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో అభద్రతా భావాన్ని పెంచిందని విమర్శించారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.