ఓ వ్యక్తి తనకు రైల్వే నుంచి రావాల్సిన రూ. 35 కోసం అలుపెరగని పోరాటం చేశాడు.ఏకంగా ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేసి తన డబ్బును తాను రాబట్టుకున్నాడు.అంతేకాకుడా తనతో పాటు 2.98 లక్షల మందికి లబ్ది చేకూర్చాడు. దీంతో రైల్వేస్ వాళ్లందరికీ కలిపి మరో రెండు కోట్ల 43 లక్షలు కట్టాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి ఇంజనీర్. 2017 జూలై 2న రాజస్థాన్ కోటా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి రైల్వేలో ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఆయన ప్రయాణం క్యాన్సిల్ అయింది.
దీంతో టికెట్ ను రద్దు చేసుకున్నాడు. అయితే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు తనకు రావాల్సిన డబ్బుల కన్నా రూ. 35లను రైల్వే తక్కువగా ఇచ్చినట్టు గుర్తించాడు.దీంతో ఈ విషయమై రైల్వే అధికారులను ఆయన ప్రశ్నించాడు.జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందని అందుకే ఛార్జ్ కట్ చేసుకున్నామని అధికారులు బదులిచ్చారు.
తాను జూలై 1 కన్నాముందే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నానని, అలాంటప్పుడు సర్వీస్ ఛార్జీ ఎలా కట్ చేస్తారని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.దీనిపై ప్రధాని, కేంద్ర మంత్రులు,ఇతర అధికారులకు సైతం ట్వీట్లు చేశారు.దీంతో ఆయన పోరాటానికి దిగివచ్చిన రైల్వే ఆ డబ్బులను తిరిగి ఇస్తానని 2019లో ప్రకటిచింది.
కానీ ఆ తర్వాత రూ.33 మాత్రమే చెల్లించింది.దీంతో మళ్లీ న్యాయపోరాటానికి దిగాడు.మూడేండ్లు పోరాటం తర్వాత ఆయనకు రూ. 2లను రైల్వే తిరిగి చెల్లించింది.దీంతో పాటు 2017జూన్ 2కు ముందు టికెట్లు బుక్ చేసుకున్న3 లక్షల మందికి డబ్బులు తిరిగి రిఫండ్ చేయాలని నిర్ణయించింది.