మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజు-అశోక్‌గజపతి రాజు మధ్య రోజురోజుకు వైరం పెరుగుతూనే ఉంది. తాజాగా సంచయిత అశోక్ గజపతి రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు. పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు గారితో పాటు అశోక్‌గజపతిరాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది అంటూ ఆనాటి లేఖను అటాచ్ చేస్తూ సంచయిత ట్వీట్ చేశారు.
రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్‌గజపతిరాజు గారు… ఎన్టీఆర్ ఆరాధ్యదైవమని కొనియాడటంతో పాటు వ్యక్తి హత్యకు కారణమైన హంతకుడే అదే వ్యక్తి దూరమయ్యారంటూ కన్నీరు కార్చినట్లు ఉందంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.