-సింగపూర్-భారత్ మధ్య యూపీఐ పే నౌ లింక్
-కొవిడ్ సమయంలో ఇ- సంజీవని గొప్ప వరం
-భారతీయ బొమ్మలకు డిమాండ్ పెరిగింది
– వృధా నుంచి సంపద ముఖ్యమైన అంశం
– తెలంగాణ పేరిణి నృత్యానికి రాజ్ కుమార్ ప్రచారం
-స్వచ్ఛతలో దుల్దేహి యువత పనితీరు అమోఘం
– మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ
భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)కి ప్రపంచ దేశాలు ఆకర్షితులవుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కొద్ది రోజుల క్రితం భారత్- సింగపూర్ మధ్య యూపీఐ- పే నౌ లింక్ ప్రారంభించబడిందన్నారు. ఇప్పుడు సింగపూర్, భారతదేశ ప్రజలు తమ దేశాల్లో చేసే విధంగానే తమ మొబైల్ ఫోన్‌ల నుంచి డబ్బును బదిలీ చేసుకుంటున్నారని అని ఆయన అన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇ-సంజీవని యాప్ ప్రజలకు గొప్ప వరం అని రుజువు అయిందన్నారు. ఈ యాప్ ద్వారా టెలి కన్సల్టేషన్ సులభంగా మారిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఈ యాప్‌ను ఉపయోగించే టెలి కన్సల్టెంట్ల సంఖ్య 10 కోట్లు దాటిందన్నారు.
ఒక పేషెంట్, డాక్టర్ మధ్య ఈ అద్భుతమైన బంధం ఒక పెద్ద అచీవ్ మెంట్ అని ఆయన కొనియాడారు.ఈ సదుపాయాన్ని వినియోగించిన డాక్టర్లు, పేషెంట్లందరినీ ఆయన అభినందించారు. మన్ కీ బాత్‌లో తాను భారతీయ బొమ్మల గురించి ప్రస్తావించినప్పుడు దేశ పౌరులు కూడా దాన్ని తక్షణమే ప్రమోట్ చేశారన్నారు.
దీంతో భారతీయ బొమ్మలు చాలా క్రేజ్‌పెరిగిందన్నారు. , విదేశాలలో కూడా వాటికి డిమాండ్ పెరిగిందన్నారు. హర్యానా లోని దుల్హేదీ గ్రామాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ గ్రామంలో యువత యువ స్వచ్చతా ఇవం జనసేవ సమితిని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ సభ్యులంతా ఉదయం 4 గంటలకే లేచి గ్రామాన్ని పరిశుభ్రం చేసే పనిలో మునిగిపోతారన్నారు.
వృధా నుండి సంపద’ అనేది కూడా స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ఒక ముఖ్యమైన అంశమన్నారు. ఇది ప్రజలకు పరిశుభ్రతతో పాటు మంచి ఆదాయ వనరుగా మారుతోందన్నారు. మనం ఒక తీర్మానం చేస్తే, స్వచ్ఛ భారత్‌కు భారీ సహకారం అందించవచ్చన్నారు. కనీసం ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో బట్టతో తయారు చేసిన బ్యాగులు వాడతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ రోజు స్థానిక ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈసారి వోకల్ ఫర్ లోకల్ అన్న కాన్సెప్ట్ తో హోలీ జరుపుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి పొందిన పేరిణి నృత్య కళ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. పేరిణి నాట్యం తెలంగాణలో కాకతీయుల కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన నాట్యం అని వివరించారు, అలాంటి నాట్యానికి రాజ్ కుమార్ నాయక్ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు అని కొనియాడారు. చరిత్రను సంస్కృతిని కాపాడేందుకు కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.