ఎవరెన్ని చెప్పినా సరే ఫేస్బుక్ అనేది ఇప్పుడు మన జీవితాల్లో అత్యంత కీలకంగా మారిన విషయం. ఫేస్బుక్ విషయంలో చాలా అంశాలు ఆధారపడి ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగ, వ్యక్తిగత, విద్య ఇలా ఏ రంగం చూసినా సరే ఫేస్బుక్ మీదనే ఆధారపడి ఉందనే మాట వాస్తవం. ఇక ఫేస్బుక్ తమ వినియోగదారుల భద్రత విషయంలో ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ ఫోకస్ చేసింది.
Also Read:నాంపల్లి కోర్టులో డ్రగ్స్ కేసుపై విచారణ..!
ప్రస్తుతం ఫేస్బుక్ విషయంలో వినియోగదారులకు అనుమానాలు ఉండటం తో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఫేస్బుక్ సహా ఫేస్బుక్ యాజమాన్యంలో ఉండే మరికొన్ని సంస్థలు అన్నీ కూడా మెటా కిందకు వచ్చేసాయి. ఇక ఫేస్బుక్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం… ఫేస్బుక్ ఎందుకు బ్లూ కలర్ ఉంటుంది… బ్లూ కలర్ ను ఎందుకు ఆ సంస్థ యజమాని మార్క్ సెలెక్ట్ చేసుకున్నాడు అనేది చాలా మందికి తెలియదు.
దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ ఎరుపు అలాగే పచ్చ రంగులను తన కంటితో చూడలేడు. మనం చూసే అన్ని రంగులు కూడా ఎరుపు, పచ్చ అలాగే మరియు బులుగు రంగుల మిశ్రమాలే. అంటే ఈ రంగులను అన్ని కలిపి అనేక రంగులు సృష్టించవచ్చు. అతను ఎరుపు రంగు చూడలేడు. కాబట్టి ఫేస్బుక్ డిజైన్ చేయడానికి గానూ బ్లూ కలర్ వాడాడు.
Also Read:యువతను కుటుంబ పార్టీలు మోసం చేస్తున్నాయి.. ప్రధాని మోడీ ఫైర్