వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి సీరియస్ గా ఉంది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. హానికరమైన ఇంజెక్షన్ ను తీసుకుంది. దీంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.
ప్రీతి తండ్రి రైల్వే ఉద్యోగి. సైఫ్ అనే సీనియర్ పీజీ విద్యార్థి వేధింపులే.. ఆమె ఆత్యహత్యాయత్నానికి కారణమైన్నట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రీతికి అన్ని రకాల చికిత్సలు చేశామని వైద్యులు చెప్పారు.