ఈ రోజుల్లో ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏది పడితే అది, ఎంత పడితే అంత, ఎక్కడ పడితే అక్కడ తింటూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవి కేవలం మన ఆరోగ్యం మీదనే కాకుండా మెదడు పని తీరు మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలా మనకు తెలియకుండా మన మెదడు పై ప్రభావం చూపేవి ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:రోజూ వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది…?
ప్రొసెస్డ్ గోధుమ, జొన్న , రాగులు పిండి వంటివి ఎంత మాత్రం మంచిది కాదు. వీటి బదులు మనమే పిండి ఆడించుకుని తినడం మంచిది. ఎక్కువగా పంచదార కలిపి సీసాలలో దొరికే కూల్ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలు కూడా మెదడుకి మంచిది కాదు. రక్తములో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి మధుమేహం వచ్చి ఆ తర్వాత మెదడుకి నష్టం జరుగుతుంది. వీటికి బదులుగా తాజాగా దొరికే పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తినడం మెదడుకి మంచిది.
ఇక చాలా మంది బానిసగా మారిపోయే ఆల్కహాల్ కారణంగా కూడా మెదడులోని న్యూరాన్స్ దెబ్బ తింటాయి. ఇక రెగ్యులర్ గా దొరికే నూడుల్స్, జంక్ ఫుడ్స్ , బేకరీ ఐటమ్స్ , కూడా మెదడు పని తీరు మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే ప్రొసెస్డ్ మాంసాహారము, ఫిష్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. వాల్ నట్స్ సహా కొన్ని రకాల చిరు ధాన్యాలు మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇలా మనకు తెలియకుండా తీసుకునే వాటితో మతి మరుపు అలాగే న్యూరాలజీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మెదడు కేంద్రీయ నాడి వ్యవస్థ కు కేంద్ర స్తానం. కాబట్టి ప్రతీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
Also Read:రెబెల్స్ కు అఘాడీ ప్రభుత్వం షాక్…!