బీహార్ లో మావోయిస్టులు కలకలం సృష్టించారు. గయా జిల్లాలో మందుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఆర్పీఎఫ్ కు సంబంధించిన కోబ్రా కమాండో దళం మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టింది. ఈక్రమంలో మావోయిస్టులు మందుపాతర్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విభోర్ కుమార్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు ధాటికి ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో మరో జవాన్ కు గాయాలయ్యాయని చెప్పారు.
వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కోబ్రా పెట్రోలింగ్ బృందంపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు.