ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. జిల్లాలోని దర్భ డివిజన్ మలంగేర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగారు.
ఈ క్యాంప్ కార్యాలయాన్ని దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల కొండకింద హీరోలిలో గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేశారు.
మావోయిస్టులకు, సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య రెండు గంటల పాటు కాల్పులు జరిగాయని ఏఎస్పీ రాజేంద్ర జైస్వాల్ తెలిపారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు.
అంతకుముందు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో శిబిరాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు వేసి, CRPFకి మద్దతు ఇవ్వొద్దని ప్రజలను హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో ఆ ప్రాంత వాసుల్లో భయాందోళన నెలకొంది.