రాజన్న సిరిసిల్ల జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖ సంచలనంగా మారింది.
గ్రామ పంచాయతీ కార్యాలయానికి మావోయిస్టు నేత జగన్ పేరిట లేఖను అంటించడంతో గ్రామస్తులు భయాందోళలకు గురవుతున్నారు.
ఆ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పేరుతో పాటు.. ప్రస్తుత సర్పంచ్, మాజీ సర్పంచ్ పేరు, ఓబులాపూర్ లోని ఓ సామాజిక వర్గం అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో అతికించారు.
తమ హెచ్చరికలను భేఖాతరు చేస్తే మాజీ సర్పంచ్ రాజిరెడ్డికి పట్టిన గతే పడుతుందని లేఖలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. కానీ.. ఆ లేఖలు ఎవరు అంటించారనేది మాత్రం క్లారిటీ లేదు.