కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మావోల కలకలం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు మావోల ఉనికి లేదనుకున్న ఏటూరు నాగారం, భూపాలపల్లి ఏరియా కమిటీ ఉంగా పేరుతో వాల్ పోస్టర్లు, పత్రికలు అంటించడం కలకలం రేపుతోంది.
తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపూర్-ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఉన్నాయి. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ లేఖలు రాశారు. బొల్లారం, సీతారాం పురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వారే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు మావోయిస్టులు పోస్టర్లలో రాశారు. మావోయిస్టుల పీఎల్ జీఏ వారోత్సవాలు ముగియడంతో ఈ లేఖలు విడుదల కావడం కలకలం రేపుతోంది.