మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఆశయాల కోసం అడవి బాట పట్టిన శారదక్క జనజీవన స్రవంతిలో చేరారు. కరోనాతో హరిభూషణ్ మరణం తర్వాత శారదక్క కూడా మరణించారన్న వార్తలొచ్చాయి. కొందరేమో ఆమె కోలుకున్నారని, మరో అగ్రనేత హిడ్మా కూడా కోలుకున్నారని మావోయిస్టు పార్టీ గతంలో వెల్లడించింది.
అయితే, హరిభూషణ్ మరణం తర్వాత అడవిలో ఉండలేకపోయిన శారదక్క… జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం కూడా సహకరించకపోవటంతో పొరుగు రాష్ట్రం డిజిపి ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటి కార్యదర్శిగా, డి సి ఎం గా శారదక్క ప్రస్తుతం బాధ్యతలో ఉన్నారు.
ఎన్నో ఏండ్లుగా పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన శారదక్క… భర్త హరిభూషణ్ ఆశయాలకు తుపాకి పట్టిన శారదక్క, భర్త లేని బందూకు తనకెందుకని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ హై కమాండ్ మాత్రం ఇంకా నిర్దారించలేదు. ఇటు పోలీసులు కూడా గోప్యంగా ఉంచుతున్నారు.