బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈ సారి ఏకంగా ఆయనకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే తన తీరు మార్చుకోక పోతే.. ప్రజల చేతిలో శిక్ష తప్పదని అన్నలు ఆయన్ని హెచ్చరించారు.
ఇక డీటైల్స్ లోకి వెళితే.. ఈమధ్య కాలంలో బెల్లం పల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ఆరిజన్ డెయిరీ ఏర్పాటులో నిండా ముంచడంతో పాటు లైగింగ వేధింపులకు ఎమ్మెల్యే పాల్పడ్డాడంటూ ఆ సంస్థ నిర్వాహకులు ఆదినారాయణ, శైలజలు ఆరోపించారు. అంతే కాదు ఎమ్మెల్యే డెయిరీలో వాటా కావాలని డిమాండ్ చేయశారన్నారు.
దీంతో పాటు తన దగ్గరికి అమ్మాయిలను పంపించాలని ఒత్తిడి చేశారన్నారు. ఇక అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వారు తీసి సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద దుమారాన్నే రేపింది. అయితే దీని పై సీరియస్ అయిన అధినాయకత్వం.. అతనిపై ఇంటరాగేషన్ రిపోర్ట్ కు ఆదేశించడం జరిగింది. మరో వైపు ఇప్పుడు మావోయిస్టులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి వార్నింగ్ ఇచ్చింది. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభ పెట్టి లొంగదీసుకోవడం అలవాటుగా మారిందని.. ఎన్ని సార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోవడం లేదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ లేఖలో పేర్కొన్నారు.
ఆరిజన్ డైరీకి ఎమ్మెల్యే అండదండలున్నాయని, ఎమ్మెల్యే వల్లనే చాలా మంది రైతులు నష్టపోయారని అన్నారు. ఎమ్మెల్యేకు డెయిరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేయడం వాస్తవని, రైతుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని.. లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని ప్రభాత్ హెచ్చరించారు. ఇక ఈ లెటర్ ఎమ్మెల్యే వర్గీయుల్లో కలకలాన్ని సృష్టిస్తోంది.