మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నాయకున్ని హత్య చేశారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడు కక్కెం నీలకంఠను మావోయిస్టులు హత్య చేశారు.
15 సంవత్సరాలుగా ఊసూర్ మండలాధ్యక్షుడిగా నీలకంఠ కొనసాగుతున్నారు. స్వగ్రామం పెకారంకు, బంధువు వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ముందే కత్తులతో, గొడ్డల్లతో దాడి చేసి హత్య చేశారు.
ఆవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనను పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నీలకంఠ కొక్కెం హత్య జరిగినట్లు తెలుస్తోంది.