చత్తీస్‌ఘడ్ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు కమిటీ తాజాగా స్పందించింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను విడిచిపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్‌ను అప్పగిస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్ సురక్షితంగా ఉంటాడని తెలిపింది.
పోలీసులతో జరిగిన దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తమపై దాడికి యత్నించాయని తెలిపింది. మావోయిస్టులను పూర్తిగా నియంత్రించేందుకు భద్రతా బలగాలు ప్లాన్ చేశాయని పేర్కొంది. పోలీసులు తమకు శత్రువులు కాదని స్పష్టం చేసింది. పోలీసు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు మావోయిస్టు కమిటీ ప్రకటనలో తెలిపింది.