భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం పాతచర్ల మామిడి తోటలో పేలుడు జరిగింది. ఓ చెట్టుకు అంటించిన మావోయిస్టుల పోస్టర్ ను ఓ యువకుడు చదువుతున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల దినంగా పాటించాలని ఓ చెట్టుకు పోస్టర్ అంటించారు మావోయిస్టులు. అయితే పోలీసులే లక్ష్యంగా పోస్టర్ వెనుక ప్రెషర్ బాంబు పెట్టారు. అది తెలియక యువకుడు అక్కడకు వెళ్లి అందులో ఉన్నది చదువుతుండగా బాంబు పేలింది.