ఈనెల 3న చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ సందర్భంగా మావోయిస్టులకు బందీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడిచిపెట్టారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్వర్ ను మావోయిస్టులు విడుదల చేశారు. దీంతో రాకేశ్వర్ తన బెటాలియన్ తో కలవనున్నారు.
5రోజులుగా మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న జవాన్ ను ఏమీ చేయవద్దని ఆయన కూతురు, కుటుంబ సభ్యులు కోరారు. మధ్యవర్తులను పంపితే విడుదల చేసేందుకు సిద్ధమని మావోయిస్టులు కూడా ప్రకటించారు. ఆయన క్షేమంగా ఉన్నారని చెప్తూ ఓ ఫోటోను కూడా విడుదల చేశారు.
ఈనెల 3న బీజాపూర్ లో జరిగిన దాడిలో 22మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలోనే జవానును మావోలు విడుదల చేశారు. అయితే, జవానును విడుదల చేసిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతానికి బయటి వారిని ఎవర్నీ వెళ్లనివ్వటం లేదు. దీంతో మావోయిస్టులు ఆ చుట్టుపక్కలే ఉన్నారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.