మావోల ప్రతీకారం.. 9 మంది జవాన్లు హతం

తెలంగాణా-ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం మళ్ళీ నెత్తురోడింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించడంతో వారు జవాన్లపై ప్రతీకారం తీర్చుకున్నారు. సీఆర్పీ ఎఫ్ జవాన్లు మంగళవారం వ్యాన్ లో ప్రయాణిస్తుండగా.. గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య  మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందగా..ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్ పూర్ ఆసుపత్రికి…జవాన్ల మృత దేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చెల్లా చెదరైన మృత దేహాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న కోబ్రా దళాల రాకను పసిగట్టి మావోలు ఈ మెరుపు దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో సుమారు వందమంది మావోయిస్టులు పాల్గొన్నట్టు అంచనా