దేశంలో మహిళలపై జరుగుతోన్న ఆగాయిత్యాలపై మర్ధానీ-2 సినిమా రాబోతుంది. యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాణిముఖర్జీ ప్రధాన పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. 2014లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం.
మహిళలను ఎలా ట్రాప్ చేస్తున్నారు, ఎలా చిత్రహింసలకు గురిచేస్తూ కిరాతకంగా చంపుతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది.