లవ్ టుడే దెబ్బకు అల్లరి నరేష్ సినిమా చితికిపోయింది. సీరియస్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రానికి మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ, లవ్ టుడే హిట్టవ్వడంతో, ఈ చిత్రాన్ని చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు.
అలా మొదటి రోజు డీసెంట్ టాక్ తెచ్చుకున్న అల్లరి నరేష్ సినిమా, వీకెండ్ గడిచేసరికి ఫ్లాప్ మూవీగా నిలిచింది. రెవెన్యూ పరంగా ఈ సినిమా చాలా తక్కువ నెంబర్స్ చూపిస్తోంది.
విడుదలైన 3 రోజుల్లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు కేవలం కోటి 28 లక్షల రూపాయల షేర్(తెలుగు రాష్ట్రాల్లో) మాత్రమే వచ్చింది. గ్రాస్ లెక్కల్లో చూసుకున్నప్పటికీ రెండున్నర కోట్లు దాటలేదు.
ఈ చిత్రానికి మొదట్నుంచి ప్రచారం తక్కువ. ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ తర్వాత రిలీజ్ కు ముందు ఓ చిన్న ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇలా ఏమాత్రం బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమాకు, అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు జరగలేదు. ఆ తర్వాత డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ, లవ్ టుడే దెబ్బకు కోలుకోలేకపోయింది.
మార్కెట్ అంచనాల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 2 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగానే వసూళ్లు రావాలి. ఇప్పుడున్న టాక్ తో లవ్ టుడే కు పోటీగా ఈ సినిమా వసూళ్లు సాధించడం దాదాపు అసాధ్యం.