ఫేస్ బుక్ సృష్టికర్త ,మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నుంచి మరో ప్రోడక్ట్ బైటకు రాబోతోంది. ఫేస్ బుక్ తరహా మరో కొత్త ఇన్వెన్షన్ అనుకునేరు.! ఇది టెక్నికల్ ఇన్వెన్షన్ కాదు,ఎమోషనల్ ఇన్వెన్షన్.మార్క్ జుకర్ ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నాడు. కొత్తసంవత్సరానికి సరికొత్త వార్తని తని ఇనిష్టా ఫాలోవర్స్ పంచుకున్నాడు. ఈయేడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపాడు.
’హ్యాపీ న్యూ ఇయర్. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో మా జీవితాల్లోకి రాబోతున్నారు’ అంటూ పోస్టు చేశారు. భార్య ప్రిస్కిలా చాన్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సైతం పంచుకున్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్కిల్లా చాన్ మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
ఈ ప్రేమ జంటకు 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ‘ఆగస్ట్’ జన్మించింది. ఇప్పుడు మరో చిన్నారికి జుకర్ బర్గ్ దంపతులు జన్మనివ్వబోతున్నారు.