యంగ్ హీరో తనిష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మరోప్రస్థానం సినిమాకు సంబంధించి సెట్ లో తనిష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తనిష్ దర్శకుడు జానీ ఇతర యూనిట్ సభ్యులు తనీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మరో ప్రస్థానం అతి త్వరలో విడుదల కానుంది. ఇందులో ఎమోషనల్ కిల్లర్ పాత్రలో తనీష్ నటించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. .