మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి ఆదిత్య రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. గత కొన్ని సంవత్సరాలుగా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్య రెడ్డి, తాజాగా పూర్తి స్థాయి ప్రజా జీవితంలోకి ప్రవేశించాడు.
రైతులు ఆదాయం పెంచడం, యువత, మహిళలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు.
కరోనా సమయంలో అనేకమందికి సహాయం అందించారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
1969 లో జరిగిన తొలితరం తెలంగాణ ఉద్యమానికి మర్రి చెన్నారెడ్డి గారు నాయకత్వం వహించారు. రెండు సార్లు ముఖ్యమంత్రి గా, అనేక రాష్ట్రాల గవర్నర్ గా మర్రి చెన్నారెడ్డి విశేష సేవలందించారు.
తాజాగా మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.