పిల్లలను దత్తతు తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం 1956 ప్రకారం తల్లి లేదా తండ్రిలో ఎవరైనా ఒకరు పిల్లలను దత్తతు తీసుకోవచ్చని తెలిపింది.
రీనా కిన్నర్ అనే ట్రాన్స్ జెండర్, భాగస్వామిలు ఫిబ్రవరి 9న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది
రీనా కిన్నర్ 1983లో జన్మించారు. ఆమెకు ఓ వ్యక్తితో మహబీర్ మందిర్, అర్దాలీ బజార్ వారణాసిలో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. ఇటీవల వారు ఓ బిడ్డను దత్తతు తీసుకోవాలని అనుకున్నారు.
అందుకోసం ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లారు. అయితే అక్కడ అధికారులు వారిని వివాహ పత్రం అడిగారు. వారిది రిజిష్టర్ మ్యారేజ్ కాకపోవడంతో వారు ధృవీకరణ పత్రం అందజేయలేకపోయారు. దీంతో అధికారులు నో చెప్పారు. ఈ మేరకు వారు హైకోర్టును ఆశ్రయించారు.