గత ఏడాది తెలుగు సినిమాలో సంచలనం అయిన విషయం… నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం. దీనికి సంబంధించి చాలా మంది చాలా రకాల మాటలు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక దీని వెనుక కారణాలు ఏంటీ అనేది తెలియకపోయినా తీవ్ర స్థాయిలో చర్చ మాత్రం జరుగుతూనే ఉంది.
Also read:పేలిన డీజిల్ ట్యాంక్.. నలుగురు మృతి
ఇదెలా ఉంటే నాగ చైతన్యకు సమంతా నచ్చడం, ఆ తర్వాత వివాహానికి కొన్నేళ్ళు ఆగడం అన్నీ కూడా కాస్త ఆశ్చర్యంగానే జరిగాయి. అయితే చైతూకి సమంతా కంటే ముందు ఎవరితో అయినా వివాహం చేయాలని చూసారా అంటే… దీనికి సమాధానం చాలా మంది దగ్గర లేదు. కాని నాగార్జునకు ఒక కోరిక మాత్రం బలంగా ఉండేది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
బాలకృష్ణ చిన్న కుమార్తె… తేజస్వినితో చైతన్య వివాహం చేయాలని నాగార్జునకి బలంగా కోరికగా ఉండేది అని వీరి మధ్య చర్చ కూడా జరిగిందని… రెండు కుటుంబాలు దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకున్నాయని వార్తలు వచ్చాయి. అప్పుడు చైతన్య, సమంతా తో ప్రేమలో ఉండటంతో ఈ విషయం బయటకు రావడంతో ఆ పెళ్లి ఆగిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లేదంటే మాత్రం… చైతన్య కచ్చితంగా బాలయ్యకు అల్లుడు అయి ఉండే వారని అంటున్నారు.
Also Read:కృష్ణపై కోపంతో ఎన్టీఆర్ కైకాలకు పెట్టిన కండీషన్ ఏంటీ…?