గుంటూరు : ఊళ్లో పెళ్లికని వస్తే తీసుకొచ్చి లోపలేశారని ఆరోపిస్తున్నారు ఓ పెళ్లికి వచ్చిన చుట్టాలు. గుంటూరు అరండల్‌పేట ఒకటో లైనులో వుండే దోనెపూడి దిలీప్‌రాజా, ప్రభావతి దంపతులు తమ కుమార్తె పెళ్లి తలపెట్టారు. ఈ పెళ్లికి వచ్చిన వారిని చూసి పోలీసులు వీళ్లు కూడా చంద్రబాబు ‘ఛలో ఆత్మకూరు’ బాపతే అనుకుని తీసుకొచ్చి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్లో పడేశారు. పెళ్లింట్లో వుండాల్సిన అతిధులు ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో కూర్చుని పోలీసుల్ని సావధానంగా తిట్టకుంటున్నారు.