ప్రభాస్‌ని డైరెక్ట్ చేయాలనే దర్శకుడు మారుతి కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. వీళ్లిద్దరి కాంబోలో సినిమా లాక్ అయింది. సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. సోమవారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. అయితే లాంఛింగ్ తర్వాత ప్రభాస్, మారుతికి ఓ పరీక్ష పెట్టాడు.
దర్శకుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ముందు టెస్ట్ కట్ పెట్టాడు. రెగ్యులర్ షూటింగ్ మొదటి రోజు ఫొటో షూట్ సెషన్, రెండో రోజు టెస్ట్ షూట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు చిన్నపాటి షెడ్యూల్ పూర్తి చేస్తాడు ప్రభాస్ “ఆదిపురుష్”, “సలార్” “ప్రాజెక్ట్ కె” వంటి భారీ ప్రాజెక్ట్‌ల చిన్న విరామం తీసుకున్న ప్రభాస్ ఈ చిత్రానికి సంతకం చేశాడు.
ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆల్రెడీ ఇద్దర్ని ఎంపిక చేశారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అగ్రిమెంట్ పై సంతకం చేయబోతున్నారు.
సినిమాలో మెయిన్ హీరోయిన్ ను ఇంకా లాక్ చేయలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.