గత కొన్ని వారాలుగా మారుతీతో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ కాబోతుందట. ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని ఇన్‌సైడ్ టాక్.
విభిన్నమైన జోనర్‌లలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు తన చేతిలో ఉండటంతో ప్రభాస్ ఈ సినిమాకి ఓకే చెప్పాడట. ఈ చిత్రంలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారని కూడా తెలుస్తోంది.
వారు మరెవరో కాదట హాట్ బ్యూటీలు మాళవిక మోహనన్,శ్రీలీల, మెహరిన్ లు అని తెలుస్తోంది. డివివి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారట. రాజా డీలక్స్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ప్రాజెక్ట్ కె, ఆది పురుష్, స్పిరిట్, సలార్ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇందులో రాధే శ్యామ్ మార్చి 11న రిలీజ్ కాబోతుంది.