మద్య తరగతి ప్రజలకు కారు అనగానే గుర్తొచ్చేది మారుతీ. మారుమూల గ్రామాల్లో అయితే ఇప్పటికీ… ఏ కంపెనీ కారు వచ్చినా మారుతీ కారు వచ్చిందంటూ దాని వెనకాల చిన్న పిల్లలు పరుగెత్తుతుంటారు. అంతలా మారుతీ ఫేమస్ అయింది. కానీ ఎందుకు మారుతి గ్రాఫ్ పడిపోతుంది, ఎందుకు ఆ కంపెనీ అన్నన్ని ఆఫర్లు ప్రకటిస్తోంది…
సామాన్య జనం మన బడ్జేట్‌లో ఏ కారు కొనాలి అనుకుంటే ముందుగా చూసేది మారుతి షోరూం వైపే. అంతగా భారతీయులకు అడిక్ట్ అయిన మారుతి ఇప్పుడు డౌన్‌ఫాల్లో ఉంది. దాదాపు 1994 ఆగస్టు-సెప్టెంబర్ అమ్మకాలకు ప్రస్తుతం సేల్స్ పడిపోయాయని కంపెనీయే ప్రకటించుకుంది. పైగా గత రెండు సంవత్సరాల గ్రాఫ్‌ను బట్టి చూస్తే దాదాపు సగానికిపైగా అమ్మకాలు తగ్గిపోయాయి. దాంతో మారుతీ తన ఉద్యోగులను ఓవైపు తొలిగిస్తూనే… మరోవైపు కొత్త వాహానాల తయారీలో కొత పెడుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలో ఆర్థికమాంద్యం చాయలు ఆటోమొబైల్ రంగం నుండే కనిపించాయి. పైగా దాని ప్రభావం ఎక్కువగా కనపడుతోంది కూడా మారుతి-సుజుకి కంపెనీ మీదే. అయితే ఆర్థికమాంద్యానికి ముందే దేశంలో ఆటోమొబైల్ రంగానికి గడ్డుకాలం స్టార్ట్ అయింది. ప్రస్తుతం దేశంలో బీఎస్-4 ప్రమాణాలు అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది నుండి బీఎస్-6 తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా 1500సీసీ దాటితేనే డీజీల్ కార్లు అందుబాటులో ఉంటాయి. ఈలోపన్నీ పెట్రోల్ కార్లే. దాంతో సహాజంగానే 800సీసీ నుండి 1500సీసీ వాహానాలు ఎక్కువగా మారుతి సంస్థయే విక్రయాలుంటాయి. దాంతో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్టట్లైంది మారుతీ సంస్థ పరిస్థితి. పైగా కేంద్రం కూడా ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు చాలా రాయితీలు ప్రకటించటం కూడా మారుతీ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
అందుకే మాంద్యం మాట మొదలైన నాటి నుండి మారుతీ ప్రతి మోడల్ పైనా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. 5000 నుండి లక్ష రూపాయల వరకు డిస్కౌంట్స్ అంటూ ప్రకటనలు వస్తున్నాయి. దాంతో… అంతా ఈ మారుతీకి ఏమైంది, ఇతర కంపెనీలతో పోలిస్తే మారుతీయే ఎందుకు ఇంతలా హైరానా పడుతోందంటున్నారు సామాన్య జనం. అయితే… మారుతీ టార్గెటెడ్ మార్కెట్ ఎక్కువగా సామాన్య-మద్యతరగతి వారే కావటం, పైగా ఉన్నవాటిలో చీప్ అండ్ బెస్ట్ అన్నట్లు ఉండే మారుతీకి ఒక్కసారిగా సమస్యలు చుట్టిముట్టడంతో పరిస్థితి తలకిందులైతోంది అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు.