హీరోయిన్లకు భిన్నంగా కెరీర్ కొనసాగిస్తోంది రాశిఖన్నా. ఓవైపు అందాలు ఆరబోస్తూనే, మరోవైపు కామెడీ క్యారెక్టర్లు చేస్తోంది. ఇదెలా సాధ్యం? దీనికి రాశిఖన్నా దగ్గర సమాధానం ఉంది. తను దర్శకుడ్ని ఫాలో అయిపోతానంటోంది.
తాజాగా ఆమె నటించిన పక్కా కమర్షియల్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో లాయర్ ఝాన్సీ పాత్ర పోషించింది రాశిఖన్నా. పూర్తిగా కామెడీ పండించే ఈ పాత్రను చేయడానికి తను ఎలాంటి ఇబ్బంది పడలేదని చెబుతోంది.
“లాయర్ ఝాన్సీ క్యారక్టర్ తో మారుతి నాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఈ పాత్ర నేను బాగా చేయడం కోసం ఆయన చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్స్ ఎలా చెప్పాలో ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. ఏంజెల్ ఆర్నా క్యారక్టర్ కంటే లాయర్ ఝాన్సీ పాత్రకు మంచి పేరు వచ్చింది” అని చెప్పింది.
ఇలా తన కామెడీ టైమింగ్ పై స్పందించింది రాశిఖన్నా. పక్కా కమర్షియల్ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని థియేటర్ లో చూశానని, తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెబుతోంది ఈ బ్యూటీ.