యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా మరో మూడు చిత్రాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా తాజాగా అందులో ఓ సినిమా మారుతి దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారట. అలాగే ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే పేరు ని కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి స్పందించారు.
నా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. టైటిల్, హీరో, సంగీత దర్శకుడు గురించి వస్తున్నా వార్తలు విన్నాను. కానీ, కాలం అన్నింటికి సమాధానం చెప్తోంది. మీ సపోర్ట్ కి ప్రేమకి ధన్యవాదాలు.. జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రభాస్ తో సినిమా పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి చూడాలి అందులో ఎంత వరకూ నిజం ఉందో.