దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు ఫోర్త్ వేవ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రజలకు మాస్క్ తప్పని సరి చేస్తూ నిబంధనలను కఠినం చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కొరడాఝుళిపించనున్నట్టు వెల్లడించింది.
మాస్క్ లేకుండా బయట తిరిగే వారిపై రూ. 500లు జరిమానా విధించినున్నట్టు తెలిపింది. ఇక కరోనా నేపథ్యంలో స్కూల్స్ ను మూసివేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పింది.
ఇక మాస్క్ తప్పని సరి నిబంధనను ఈ నెల 2న ప్రభుత్వం తొలగించింది. దీంతో పాటు మాస్క్ లేకపోతే జరిమానా విధించే నిబంధనను ఎత్తి వేసింది. అయితే నిబంధనలు తొలగించి రెండు రాలు కాకముందే మరోసారి కరోనా విజృంభించడంతో మరోసారి నిబంధనలను అమలు చేస్తున్నారు.