చైనాను కరోనా వైరస్ భయపెడుతూనే ఉంది. ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్లాలన్నా భయంతో వణికిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు సూచిస్తున్న ఎప్పుడు కరోనా వైరస్ బారిన పడతామోననే ఆందోళనతో అక్కడి ప్రజలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. పెంపుడు జంతువులకు కూడా ఈ కరోనా మహమ్మారి సోకుతోందోననే భయంతో వాటికీ మాస్కులు తొడుగుతున్నారు. సరిగా వాటికీ సరిపోయేలాగా మాస్కులను సిద్ధం రెడీ చేస్తున్నారు. చాలామంది పెంపుడు జంతువులను కూడా కుటుంబ సభ్యులా ట్రీట్ చేస్తుంటారు. అందుకే ముందస్తు చర్యలో భాగంగా కరోనాను కాస్తయినా నిలువరించేందుకు జంతువులకు మాస్కులను తొడిగించి కరోనా వైరస్ ను మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ జంతువులకు సోకదని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు చైనా నేషనల్ హెల్త్ కమిషన్. కరోనా వైరస్ సోకినా వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ వైరస్ పక్కనున్న వ్యక్తులకు సోకె ప్రమాదముందని తెలిపారు. దాంతో జనాలు తమ పెంపుడు జంతువులకు కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులను కడుతున్నారు.
Advertisements