ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టే ప్రయత్నంలో అధికారులు కుస్తీలు పడుతున్నారు. ఇటు తెలగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణాలు అధికంగా పెరగడంతో ఇంకొంత ఆందోళన మొదలైంది. అయితే ఆ మాయదారి కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మాస్క్ లేకుండా ప్రయాణాలు చేసే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ రైల్వే అధికారులు అమలు చేస్తున్నారు.
రైళ్లు, ప్లాట్ ఫారమ్ లపై మాస్క్ లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది. జనవరి 12వ తేదీన సెంట్రల్ రైల్వే స్టేషన్లలో మాస్క్ లు ధరించని 256 మందికి జరిమానా విధించింది రైల్వేశాఖ. వారి నుంచి 44,900రూపాయలను జరిమానాగా వసూలు చేశారు అధికారులు. ఈ జనవరి నెలలో ఇప్పటివరకు మొత్తం 2293 మందిని మాస్క్ లు వేసుకోని వారికి జరిమానాలు విధించింది. వారి నుంచి రూ.3.93 లక్షల జరిమానా వసూలు చేశారు.
కోవిడ్ అనలాగ్ బిహేవియర్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్క్ లు ధరించని ప్రయాణికుల నుంచి జరిమానా వసూలు చేసే విధానాన్ని సెంట్రల్ రైల్వే ఏప్రిల్ 2021 నుంచి ప్రారంభించింది. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం మాస్క్ లు ధరించనందుకు సెంట్రల్ రైల్వేలోని టికెట్ చెకింగ్ సిబ్బంది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డారు. మొత్తం 30,375 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ .50.20లక్షల జరిమానా వసూలు చేశారు.
ముంబై డివిజన్ లో 3,143 మంది నుంచి రూ.6.18 లక్షల జరిమానా వసూలైంది. భూసావల్ డివిజన్ లో 14,046 మంది నుంచి రూ .16.41 లక్షలు, నాగ్ పూర్ డివిజన్ లో 7,924 మంది నుంచి రూ .15.84 లక్షలు, షోలాపూర్ డివిజన్ లో 2,404 మంది నుంచి రూ .5.20 లక్షలు, పూణే డివిజన్ లో 2,858 మంది నుంచి రూ .6.57 లక్షల జరిమానా వసూలు చేశారు రైల్వే అధికారులు.