చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘మసూద’ చిత్రం మౌత్ టాక్‌తో సూపర్ హిట్ అయింది. యువ నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేశారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టింది. ఈ గురువారంతో ఈ సినిమా 2 వారాలు పూర్తి చేసుకుంది.
ఈ సినిమా 14 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..మసూద ఏరియా వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) – రూ. 5.16 కోట్లు గ్రాస్ రాయలసీమ (సీడెడ్) – రూ. 0.84 కోట్లు గ్రాస్ ఆంధ్ర ప్రదేశ్ – రూ. 3.06 కోట్ల గ్రాస్ మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 9.06 కోట్ల గ్రాస్ (రూ. 4.83 కోట్ల షేర్ రాబట్టింది)కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ రూ. 0.50 కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.56 కోట్లు గ్రాస్ వసూళ్లు (రూ. 5.08 కోట్ల షేర్) రాబట్టింది.
మసూద తెలుగులో రూ. 1.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం రూ. 3.58 కోట్ల లాభాలతో త్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ’మసూద’ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
మసూద చిత్ర విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో వచ్చిన రెగ్యులర్ హార్రర్ చిత్రాల్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్ద దర్శకుడు సాయి కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు.
మొత్తంగా నిర్మాతగా దిల్ రాజు మసూద చిత్రాన్ని విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం మౌత్ టాక్‌తో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ యేడాది బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ స్టేటస్ అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది.