మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గెలుపోటములు లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. మెగాస్టార్ మాస్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి మాస్ హీరోతో.. మరో మాస్ డైరెక్టర్ జత కలిస్తే.. ఇంక బొమ్మ హిట్టే. అలాగే ఈ సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.
మొదటి నుంచి గోపీచంద్ మలినేని తన సినిమాల్లో మాస్ యాక్షన్ ప్రధానంగా ఉండేట్టు చూసుకుంటాడు. మాస్ డాన్సులు .. డైలాగులతో పాటు కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’, ‘క్రాక్’ లాంటి సినిమాలతో సత్తా చాటుకున్నాడు.
ఈ నేపథ్యంలో గోపీచంద్ కు డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మలినేనితో సినిమా చేయడానికి సిగ్నల్స్ ఇస్తున్నట్టు సమాచారం. పెద్ద హీరోలు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండనుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా డైరెక్టర్ గోపీ చంద్, మెగాస్టార్ కి ఓ కథను వినిపించాడని.. ఆ స్టోరీ కూడా చిరుకు బాగా నచ్చేసిందట.
ఇద్దరు ముగ్గురు దర్శకులు చిరంజీవికి కథలు వినిపించినప్పటికీ, ఆయన గోపీచంద్ మలినేని సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.